APSRTC: ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 60 ప్రయాణికులకు ఏమైంది?
Updated: Sat, 18 Jul 2026 (13:16 IST)
ఒంగోలు మీదుగా కొండపి నుండి మద్దులూరుకు వెళ్తున్న ఏపీఎస్సార్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ద్వారక సీ ఫుడ్ సమీపంలో బోల్తా పడింది. శనివారం నాడు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులతో సహా సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
రోడ్డు పక్కన ఉన్న దట్టమైన ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వస్తున్న బస్సు డ్రైవర్‌కు కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి