శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (11:11 IST)

ఆంధ్రా ఔరంగజేబు జగన్: దివ్యవాణి

పంచాయతీ ఎన్నికల్లో అధికారపక్షం ఎంతభయపెట్టినా, ప్రలోభ పెట్టినా, అనేకగ్రామాల్లో ఓటర్లు టీడీపీఅభ్యర్థులను గెలిపించి ప్రజా స్వామ్యాన్ని రక్షించారని టీడీపీ అధికారప్రతినిధి శ్రీమతి దివ్యవాణి తెలిపారు. ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ...! 
 
రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఘటనతో ఔరంగజేబు పాలనను తాము భరించలేకపోతున్నామని ప్రజలంతా వాపోతున్నారు. జగన్ పాలనైతే, ఔరంగజేబు పాలనంటారేమిటని ప్రజలను అడిగాను. దానికివారు రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలేమైపోయినా తనకు పర్వాలేదు, తనకు కావాల్సింది వారి ఓట్లుమాత్రమేనని అనుకునేలా పరిపాలనచేసింది ఔరంగజేబు ఒక్కడేగా అంటున్నారు.

73ఏళ్ల వయసున్నవ్యక్తిని కాలుకదపనీయకుండా విమానాశ్ర యంలో నిర్బంధించడం ద్వారా ఆంధ్రాఔరంగజేబు పాలన ఏస్థాయి కి చేరిందో ఆలోచించుకొని ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. వైసీపీమంత్రులు, ఆడరౌడీనేతలు, ఒకప్పుడు ఏంచెప్పారు? మ ద్యాన్నికేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితంచేస్తామని, మద్యపాన నిషేధం అమలుచేస్తామని, మందుసీసాలు పగులగొట్టారు.

ఇప్పడే మో మద్యంవిక్రయాలద్వారా వచ్చే సంపాదనపైనే ప్రభుత్వాన్ని న డుపుతున్నారు. అమ్మఒడిపేరుతో అరకొరసాయంచేస్తూ, నాన్నబుడ్డిపేరుతో ప్రజలనుంచిట్యాక్సులరూపంలో ఏస్థాయిలో వసూలుచేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో ని వారంతా మద్యంవిషయంలో జగన్ చెప్పిందేమిటో, చేస్తున్న దేమిటో ఆలోచించాలి.

చంద్రబాబునాయుడి గారి పాలనలో ఉచిత ఇసుకవిధానం అమలైతే, ఇప్పుడు ఇసుకను పొరుగురాష్ట్రాలకు తరలిస్తూ, జగన్, ఆయనమంత్రులు వేలాదికోట్లు దోచుకుంటున్నా రు. ఆంధ్రా ఔరంగజేబు చర్యలతో నిర్మాణరంగంపై ఆధారపడి బతికే వేలాదికుటుంబాలు రోడ్డునపడ్డాయి.

మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లే వైసీపీవారిని ప్రజలుఅనేక అంశాలపై నిలదీస్తు న్నారు. భారతి సిమెంట్స్ కు లాభాలు కట్ట బెట్టడంకోసమే జగన్ సిమెంట్ ధరలు పెంచేశాడు. ప్రజలకు పథకాలనే బిస్కట్లను ఎరగా వేస్తూ, వివిధరకాలుగా వారిని దోపిడీచేస్తున్న ఘనత ఆంధ్రా ఔరం గజేబుకే దక్కింది.

ప్రజలకష్టార్జితంపై పన్నులువేసి, వారినుంచి ఏ స్థాయిలో దోపిడీచేస్తున్నారో కూడా జగన్ సమాధానంచెప్పాలి. రాష్ట్రంలోని మహిళలంతా జగన్ ముద్దులుపెట్టగానే సంబరపడిపో యారు. ఇప్పుడు వారంతా జగన్ అనే జలగ దెబ్బకు తమకష్టార్జి తాన్ని పెరిగినధరలకే వెచ్చిస్తున్నారు.  మహిళలంతా పెరిగిన నిత్యావసరాల ధరలపై ఆలోచన చేయాలి.

చంద్రబాబు పాలనలో కేజీ బియ్యంధర –రూ.40లుంటే, జగన్ ముఖ్యమంత్రయ్యాక కేజీ బియ్యంధర రూ.49కి పెరిగింది. కందిపప్పు ఆనాడు కేజీరూ.74 ఉంటే, జగన్ ప్రభుత్వంలో కేజీ రూ.118కి పెరిగింది. ఒక కేజీ కందిపప్పుపై రూ.21వరక పెంచాడు. పెసరపప్పు ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.75అయితే, జగన్ ప్రభుత్వంలో కేజీ-రూ.107కు పెరిగింది.

మినప్పప్పుధర ఆనాడు కేజీ-65అయితే, జగన్ ప్రభుత్వంలోరూ.125కుపెరిగింది. వేరుశనగనూనే రూ.106 నుంచి రూ.180కు పెరిగితే, పామాయిల్ ధరకేజీరూ.74నుంచి రూ.130కు పెరిగింది. నిత్యావసరాల ధరలతోపాటు పెట్రోల్ –డీజిల్ ధరలు కూడా జగన్ దారుణంగా పెంచేశాడు. అంతటితో ఆగకుండా ఆర్టీసీఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటిపన్ను, ఆస్తిపన్ను చెత్తపన్నుపేరుతో ప్రజలను ఆంధ్రా ఔరంగజేబు దారుణంగా తన జేబులు నింపుకుంటున్నాడు.

జగన్ పథకాల అమలుకోసం ప్రజల సొమ్మునే వివిధరూపాల్లో లాగేస్తున్నాడు. అభివృద్ధిచేసి, తద్వారా వచ్చేఆదాయాన్ని ఎవరైనాప్రజలసంక్షేమంకోసం వినియోగిస్తారు. కానీ జగన్ ప్రజలసొమ్ముని వివిధరూపాల్లో పోగుచేస్తూ, చిల్లర జనాలకుఇస్తూ, మిగిలిందంతా తనసొంతఖజానాలో వేసకుంటన్నా డు. చంద్రబాబునాయుడు నిరుద్యోగభృతిని అమలుచేస్తే, జగన్ దాన్ని నిలిపివేశాడు.

ఉద్యోగాలిచ్చానని చెప్పుకోవడానికే జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అదినచ్చక బయటకువచ్చే యువతపై తప్పుడుప్రచారంచేస్తున్నారు. 50ఇళ్లకు ఒక వాలంటీర్ పేరుతో ఇంటింటి సమాచారాన్ని సేకరిస్తూ, చెత్తపాలన చేస్తున్నారు . చంద్రబాబుప్రభుత్వం రూ.5కే కమ్మటిభోజనం పెడితే, అన్నాక్యాం టీన్లు మూసేసిన జగన్,పేదలపొట్టపైకొట్టాడు.

అధికారంలోకి వస్తే, పింఛన్లు రూ.3వేలకు పెంచుతానన్న జగన్, రూ.1000ని నాలుగు భాగాలుచేసి, అవ్వాతాతలనుమోసగించాడు. రూ250మాత్రమే పెంచి, వారిని నిలువునా వంచించాడు. ప్రభుత్వ ఉద్యోగులకు తొలి వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తానన్న జగన్, ఇప్పుడు దానిఊసే ఎత్తడంలేదు. పీఆర్సీ, డీఏలచెల్లింపులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. 

విదేశాల్లో చదువుకునే విద్యార్థు లకు చంద్రబాబునాయుడు రూ.10లక్షలిస్తే, జగన్ దాన్ని ఆపేశాడు విదేశాల్లో విద్యాభ్యాసంచేసే యువతకలలను ఈముఖ్యమంత్రి నాశనం చేశాడు. విద్యార్థినీవిద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు కూడా నిలిపివేశారు. టిడ్కోఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు, 70, 80శాతం వరకు పూర్తయితే, మిగిలినదాన్ని పూర్తిచేసి వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్ ఎందుకు ఆలోచిస్తున్నాడు.

వాటిని పేదలకుఇస్తే, వారంతా చంద్రబాబు పేరే చెప్పుకుంటారని, దాంతో తానిచ్చిన సెంటుస్థలం జనందృష్టిలో ఎందుకూపనికిరాకుం డాపోతుందనే భావనలో జగన్ ఉన్నాడు. రాష్ట్రంలోని రోడ్లపై ప్రయా ణిస్తే చాలు ఫ్రీ డెలివరీ జరిగిపోతుందని ప్రజలంతా ఛలోక్తులు వేసుకుంటున్నారు. ఎక్కడా కిలోమీటర్ రోడ్డుకూడా వేయనిజగన్ రోడ్డుసెస్సుపేరుతో వాహనదారులనుంచి దండుకుంటున్నాడు. 

ప్రజలపై ఆస్తిపన్నువేసిన జగన్, తనకున్నఆస్తులతాలూకా పన్నులు సక్రమంగా చెల్లిస్తే, రాష్ట్రానికున్న అప్పులు సగవరకు  ప్రజలంతా అనుకుంటున్నారు.  రాష్ట్రప్రజలకోసమే చంద్రబాబునా యుడు జగన్ చేస్తున్న అవమానాలను భరిస్తున్నాడు. పడ్డవాడె ప్పుడూ చెడ్డవాడుకాడు.

చంద్రబాబు సమర్థుడు, సత్తాఉన్నవాడు కాబట్టే, ప్రజలకోసం జగన్ దాష్టీకాలను, దౌర్జన్యాలను భరిస్తున్నాడు. మంత్రి బూతులునాని అలియాస్ బీ-నానీ తమ నాయకుడి గన్ పవరేంటో తెలియాలంటే, మీ నాన్నను అడగాలంటున్నాడు. గన్ పవరేంటో ప్రజలకు అర్థమైంది. దానిగురించి చెప్పింది వైసీపీ ఆడరౌడీలే.

జ‘గన్’  గన్ కాదని, దీపావళి ఆటవస్తువని ప్రజలకు అర్థమైంది. అది ఆటవస్తువుకాబట్టే, అన్నిమార్గాలు మూసుకుపోవ డంతో చివరక శ్మశానం, ఎడారి అన్న అమరావతిపై అప్పు తీసుకో వడానికిసిద్ధమయ్యారు. అబద్ధాల రాంబాబు ఎవరా అంటే అంబటి రాంబాబు అని తెలిసింది. అధికారం చేతిలో ఉందికదా అని, నోరుంది కదా అని ఏదిపడితేఅది మాట్లాడటం మానుకుంటే మంచిది.

పెంప కం గురించి అంబటి మాట్లాడటం హాస్యాస్పదం. భువనేశ్వరి గారి పెంపకం ఎలాంటిదో, చంద్రబాబునాయుడుగారు ఎంతటి సంస్కారో  ప్రజలకు తెలుసు అంబటి. భువనేశ్వరిగారు  ఏ1, ఏ2లా లోకేశ్ ను పెంచలేదు. అవినీతి సంపాదనకోసం ఐఏఎస్ లను జైళ్లకు పంపమ ని కూడా ఆమెచెప్పలేదు. లోకేశ్ సంస్కారం గురించి, సంస్కార హీనులైన వైసీపీనేతలు మాట్లాడటం ప్రజలుచేసుకున్న దౌర్భాగ్యం.

కుటుంబాల్లోని ఆడవారిని బయటకు తీసుకొచ్చి మాట్లాడటం మానేసి, ఆరోగ్యకరమైన రాజకీయాలు అంబటిచేస్తే మంచిది. జలగ ల్లా ప్రజల ధనాన్ని పీలుస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో పట్టణఓటర్లంతా తగినవిధంగా బుద్ధిచెప్పాలని కోరుతున్నాను.