బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:16 IST)

పుష్ప శ్రీవాణి కూతురిని ఆశీర్వదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్పా శ్రీవాణికి కొద్ది రోజుల కిందట పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.

తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించడంతో మహాలక్ష్మి తమ ఇంట్లో అడుగుపెట్టిందని పుష్ప శ్రీవాణి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

ఈ మేరకు పుష్ప‌ శ్రీవాణి, పరీక్షిత్ ‌రాజు దంపతులు తమ ముద్దుల కూతురితో కలిసి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.‌

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. పాపకు తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు.