జగన్‌ రోజువారీ ఆదాయం రూ.300 కోట్లు : మాజీ ఎంపి జెసి ఆరోపణ

jc diwakar reddy
ఎం| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:45 IST)
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపి జెసి దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు కలుషితం అయ్యాయని, అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేస్తారనుకుంటే పొరపాటేనని అన్నారు. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. సిఎం జగన్‌ ఒక్క రోజు ఆదాయం రూ.300 కోట్లు అని, అయితే ఇది ఎంతవరకు నిజమో.. తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

అభివృద్ధి చూసి వైసిపికి ఓటేశారని చెప్పడం అబద్ధమని, అదంతా వైసిపి నేతల దొంగ మాటలని అన్నారు. డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని, డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, అయినా వైసిపితో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని అన్నారు.

అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అందుకే కుప్పంలో టిడిపి ఓటమి పాలైందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ పెద్దపల్లిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యపై దివాకర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో అన్ని ఆధారాలు ఉన్నా విచారణ ఎందుకని ప్రశ్నించారు.
దీనిపై మరింత చదవండి :