సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:06 IST)

బిజేపి‌ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

వైసిపి అభ్య‌ర్థుల‌ను  గెలిపిoచాలని నిర్వ‌హించే  ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నార‌న్నారు.  జ‌గ‌నన్న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషాంగా ఉన్నార‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.
 
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సొమ‌వారం 46వ డివిజ‌న్ అభ్య‌ర్థి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి(న‌రేంద్ర‌)తదిత‌రుల‌తో క‌లిసి  కలరా హాస్పిటల్ వద్ద నుంచి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విస్తృతంగా ప‌ర్య‌టించారు...  ప్రజలను స్వయంగా కలిసి   కొండ ప్రాంత సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మ‌హిళలు, స్థానిక మైనార్టీ నాయ‌కులు మంత్రికి పూలతో స్వాగ‌తం ప‌లికారు... జ‌గ‌న‌న్న‌కు జైజైలు ప‌లికారు.
 
బిజేపి‌ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు..
వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో బిజేపి పార్టీ సీనియర్ నాయకులు,మాజీ సిటీ ఆధ్యక్షులు, కొత్తమాసు పిచ్చయ్య, ఆయ‌న అభిమానులు మంత్రి వెలంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు.
 
సొమ‌వారం ఉదయం  బ్రహ్మాణ వీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి కార్యాలయంలో  39 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ రాఘ‌వా న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో  బిజేపి‌ నాయ‌కులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.