ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇపుడు నిబంధన 71 చర్చనీయాంశంగా మారింది. ఈ నిబంధన గురించి విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పుణ్యమాని తెలుసుకునే వీలు కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో 150 (స్పీకర్ మినహా) సభ్యుల బలం ఉండటంతో ఏకపక్షంగా ఆమోదించుకుంది. ఆ తర్వాత ఇదే బిల్లును శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టింది. ఇక్కడ 34 మంది సభ్యుల మద్దతున్న తెలుగుదేశం...