1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Govt Upgrades Teachers Posts

ఏపీలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ తాయిలాలు

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులపై ప్రమోషన్ అనే తాయిలం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 10వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించింది. ఇందులోభాగంగా, 4 వేలమంది ఎస్జీటీలను ఎస్ఏలుగా ప్రమోషన్ చేసింది. 
 
అలాగే,998 మంది ఎస్ఏలను ప్రిన్సిపల్ (గ్రేడ్ 2)పోస్టులకు అప్‌గ్రేడ్ చేసింది. 2342 మంది ఉపాధ్యాయ పోస్టులను మార్పిడి చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 
 
అలాగే, 52 ప్రీ స్కూళ్ళను ఉన్న పాఠశాలలుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమషనర్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమలులో భాగంగా ఈ పదోన్నతులు కల్పించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
కాగా, తమ సీపీఎస్ విధానం రద్దుతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మిలియన్ మార్చ్ పేరుతో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులతో పాటు ఏపీ ఉద్యోగులు తలపెట్టారు. దీనిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇపుడు పదోన్నతి తాయిలాలు ప్రకటించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
తర్వాతి కథనం
నేడు గణేష చతుర్థి : జగన్, కేసీఆర్, బాబు, పవన్ శుభాకాంక్షలు