1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cabinet okay to minorities sub plan

మైనార్టీలకు సబ్ ప్లాన్‌ ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర

ap
ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చించింది. వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
ఊరు ఊరికో జమ్మి చెట్టు... గుడిగుడికో జమ్మి చెట్టు!