1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Jagan comments on Corona Vaccine

18 ఏళ్ళు పైబడిన వారికి సెప్టెంబర్ నుంచి వాక్సిన్.. సీఎం జగన్

Corona
దేశంలో వాక్సిన్ కొరత ఉత్పత్తి సామర్ధ్యంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వాక్సిన్‌కి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ వాక్సిన్‌పై తన అభిప్రాయం వెల్లడించారు. కరోనాకు వాక్సిన్ అనేది ఇప్పుడు పరిష్కారంగా ఉందని జగన్ వివరించారు. వాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
 
వచ్చే ఏడాది జనవరి నాటికి అందరికి వాక్సిన్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 18 ఏళ్ళు పైబడిన వారికి సెప్టెంబర్ నుంచి వాక్సిన్ అందిస్తామని అన్నారు. కరోనా విషయంలో శానిటేషన్ అనేది చాలా కీలకం అని అందరూ చాలా శుభ్రంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. 18 ఏళ్ళు పైబడిన వారు అందరికి వాక్సిన్ ఉచితంగా ఇస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్