1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM YS Jagan to visit Ongole

7న ప్రకాశం జిల్లాకు ఏపీ సీఎం జగన్

Ongole
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆయన ఒంగోలుకు వస్తున్నారు. 
 
నవరత్నాల కార్యక్రమాల అమలును ఇప్పటి వరకూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే ప్రారంభిస్తూ వచ్చిన జగన్‌... రెండో విడత ఆసరా కార్యక్రమాన్ని బహిరంగ వేదిక ద్వారా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వేదికగా ఒంగోలును ఎంచుకున్నారు. 
 
మీట నొక్కి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం వల్ల లబ్ధిదారులకు నగదు చేరినా ప్రభుత్వానికి రావాల్సినంత ప్రచారం రావడం లేదన్న అభిప్రాయం సీఎం జగన్‌తో పాటు వైకాపా శ్రేణుల్లో నెలకొంది. అందుకే బహిరంగ సభ ద్వారా ఆసరాను ప్రారంభించేందుకు సీఎం సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 
తర్వాతి కథనం
రేపు 'వైఎస్‌ఆర్‌ ఆసరా' .. వరసగా రెండో ఏడాది