గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:48 IST)

ఏపీలో స్వేచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా 7 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థినులకు నాణ్యమైన శానిటరీ నేప్‌కిన్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
 
దాదాపు 10 లక్షల మంది బాలికలకు ఈ నేప్‌కిన్ల పంపిణీ ద్వారా వారి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తోంది. రుతుక్రమం సమస్యల కారణంగా చదువులు ఆగిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ స్వేచ్ఛ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు చెప్తున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వ, యూనిసెఫ్, వాష్, పి అండ్ జి, సంయుక్త సహకారం తో స్వేచ్ఛలో భాగంగా ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించనుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వ విద్యాసంస్థల తో స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.