శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (18:00 IST)

ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 30,515 శాంపిళ్లను పరీక్షించగా 429 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కాగా కోవిడ్ కారణంగా గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసులకు గాను 20,26,336 మంది డిశ్చార్జ్ కాగా 14,208 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753.