సంబంధిత వార్తలు
- లాక్డౌన్ అంటూ అచ్చం నకిలీ ఆర్డర్లు సృష్టించిన సీఏ కేటుగాడు అరెస్టు
- నెల్లురు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం ఆ అరటి పండ్ల వ్యాపారిని చూసి అదిరిపోతోంది, ఎందుకో?
- నెల్లూరు దామరమడుగు వద్ద ఘోర ప్రమాదం : 8 మంది దుర్మరణం
- తెలుగు రాష్ట్రాల్లో దూసుకొచ్చిన మృత్యువు .. చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ...
- నెల్లూరు జాతీయ రహదారిపై రివ్వుమంటూ స్విఫ్ట్ కారు, ఆపి చెక్ చేస్తే రూ. 1 కోటి
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఫైట్: రీ-పోలింగ్.. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో..?
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రీ-పోలింగ్ జరగనుంది.
అంటిపేట ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నిర్మల పేరుకు బదులు వేరే పేరును బ్యాలెట్‌పేపర్‌పై ముద్రించడంతో.. నిన్న పోలింగ్ నిలిపివేశారు. నెల్లూరు జిల్లా AS.పేట మండలం పొనుగుపాడులో బ్యాలెట్ బాక్సును ఓ పార్టీ ఏజెంట్ నీటితొట్టెలో వేయడంతో.. అక్కడ కూడా నిన్న పోలింగ్ నిలిచిపోయింది.
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో రీ పోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లా ఉయ్యందనలో రిగ్గింగ్‌పై కలెక్టర్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఇక పరిషత్ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్.. ఈసారి కేవలం 60.91శాతంగానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81శాతం పోలింగ్ రికార్డయింది. అప్పటి కంటే ఇప్పుడు ఏకంగా 20 శాతం మంది తక్కువగా ఓట్లేశారు.
