సంబంధిత వార్తలు
- దసరా స్పెషల్ : విజయవాడకు 1000 ప్రత్యేక బస్సులు
- స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 40మంది విద్యార్థులు ఏమయ్యారు?
- ప్రేమకు అడ్డొస్తున్నాడనీ తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కుమార్తె.. ఎక్కడ?
- జగిత్యాల జిల్లా.. బస్సు టైర్ కింద తలపెట్టిన మహిళ
- గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. బస్సు అడ్డంగా వున్న బైక్ తీయమనేసరికి?
RTC
బస్సుకు అడ్డంగా ఉన్న బైకును తీయాలని హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌ను కొందరు దుండగులు బస్సు నుంచి కిందకి లాగి దాడికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి బయలుదేరింది.
ట్రంకు రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఓ బైక్ అడ్డంగా కనిపించింది. దీంతో బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ బైక్‌ను పక్కకు జరపాలంటూ హారన్ మోగించాడు.
మరోవైపు, వెనక వాహనాలు జామ్ కావడం, అక్కడే పోలీసులు ఉండడంతో బైక్ యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మొత్తం 14 మంది కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించారు.
ఓ చోట బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను కిందికి దింపి విచక్షణ రహితంగా దాడిచేశారు. రోడ్డుపై పడేసి కడుపులో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ చెలరేగిపోయారు.
డ్రైవర్ తనను వదిలేయాలని వేడుకున్నా కనికరించలేదు సరికదా, మరింత రెచ్చిపోయారు. చుట్టూ ఉన్నవారు చోద్యం చూస్తూ వీడియోలు తీశారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నంపై సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై ఇప్పటికే పలు నేరారోపణలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
