26 ఏళ్ల భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష.. చెరకు కర్రతో 12 దెబ్బలు
సింగపూర్‌లో ఉంటున్న ఓ 26 ఏళ్ల భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కారణంగా ఆతనికి ఈ జైలు శిక్ష పడింది. 2019 మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ కాలేజ్ స్టూడెంట్. ఆ రోజు రాత్రి, ఆమె ఒంటరిగా బస్ స్టాండ్‌కు వెళ్లింది. అప్పటికే అక్కడ.. చిన్నయ్య అనే భారతీయుడు ఉన్నాడు. అతనొక క్లీనర్.
చిన్నయ్యను ఆమె దారి అడగటంతో ఆమెపై దాడి చేసి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి అత్యాచారానికి పాల్పడిన చిన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలిని ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా గుర్తు పట్టలేనంతగా చిన్నయ్య దాడి చేశాడు. ఈ కేసుపై గత కొన్నేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది.
చివరికి.. ఇటీవలే తీర్పు వెలువడింది. అన్ని కోణాల్లో విచారణ పూర్తైన తర్వాత.. నిందితుడికి 16ఏళ్ల జైలుతో పాటు చెరకు కర్రతో 12 దెబ్బల శిక్షను విధించింది సింగపూర్ కోర్టు.