సంబంధిత వార్తలు
- 24-07-2022 ఆదివారం రాశిఫలాలు... తొందరపాటు తనం వద్దు
- 23-07-2022 శనివారం రాశిఫలాలు ... అభయ ఆంజనేయస్వామిని తమలపాకులతో
- 22-07-2022 శుక్రవారం రాశిఫలాలు ... దుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం..
- 21-07-2022 గురువారం రాశిఫలాలు ... రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా..
- 20-07-2022 బుధవారం రాశిఫలాలు ... లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..
ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభం.. చార్జీలు ఇవే
ఏపీఎస్ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభించనుంది. ఈ రోడ్డు రవాణా సంస్థ కార్గో విభాగాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. అలాగే, డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50 కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్ను ఇంటి వద్దకే చేర్చేలా చర్యలు తీసుకోనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
పార్శిల్ కౌంటర్ నుంచి 10కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కేంద్రాలు, 84 ముఖ్యపట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సేవలకు వసూలు చేసే ధరలను కూడా ప్రకటించింది ఒక కేజీ వరకు రూ.18, 1 నుంచి 6 కేజీల వరకు రూ.30, 6 నుంచి 10 కేజీల వరకు రూ.36, 10 నుంచి 25 కేజీల వరకు రూ.48, 25 కేజీల వరకు 50 కేజీల వరకు రూ.59 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
