గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-07-2022 గురువారం రాశిఫలాలు ... రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా..

Raghavendra
మేషం :- చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో అనందాన్ని ఇస్తుంది. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
మిథునం :- ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడతారు. ధనం బాగుగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు.
 
కర్కాటకం :- స్త్రీల ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
సింహం :- విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు పానీయ వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య గతంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు తొలిగిపోతాయి. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. పాత బిల్లులు చెల్లిస్తారు.
 
కన్య :- దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు గమనించండి. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. పెద్దల ఆర్యోములో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం.
 
తుల :- కాంట్రాక్టర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వెయ్యడం మంచిది. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. బంధు మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి నిస్తుంది. కుటుంబీకులతో సంభాషించటానికి కూడా తీరిక ఉండనంత బిజీగా ఉంటారు. పెద్దలకు ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలో ఆకస్మికంగా వేదాంత ధోరణి కానవస్తుంది. కుటుంబీకులతో ఏకీభించలేకపోతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు.
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులౌతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి చికాకు తప్పదు. వాగ్వివాదాలకు సరైన సమయంకాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది.
 
కుంభం :- బ్యాంకు వ్యవహారాలలో, ప్రయాణాలలో మెళుకువ అవసరం. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మీనం :- ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు. అకాల భోజనం, శరీరశ్రమ వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపంవల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది.