ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-07-2022 బుధవారం రాశిఫలాలు ... లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..

మేషం :- పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.
 
వృషభం :- మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం. 
 
మిథునం :- రిప్రజెంటేటివ్‌ల శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడక తప్పదు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కర్కాటకం :- ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాక వల్ల ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. స్త్రీకు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ఏకాగ్రత వహిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు రాతపరీక్షలలో మెళుకువ అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
కన్య :- రిప్రజెంటేటివ్‌ల శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదని గమనించండి.
 
తుల :- బంధువుల రాకతో కుటుంబములో సందడి నెలకొంటుంది. ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
వృశ్చికం :- పూర్వ మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఏమరపాటుతనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆప్తుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహంలో మరమత్తులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. సోదరీ, సోదరుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు :- ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరులకు పూర్తి బాధ్యతలు అప్పగించటం మంచిది కాదని గమనించండి. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
మకరం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. వాతావరణంలో మార్పు వల్ల మీ పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండికుదుటపడతారు.
 
కుంభం :- ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
మీనం :- హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచన లుంటాయి. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. రాజకీయాల్లో వారికి తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.