1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APSRTC To Run Special Buses For Dasara Rush

APSRTC: దసరా పండుగ రద్దీ.. హైదరాబాద్, వైజాగ్ నగరాలకు ప్రత్యేక బస్సులు

APSRTC
దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుండి హైదరాబాద్, విజయవాడ నగరాలకు అక్టోబర్ 9 నుండి 21 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ ప్రాంతీయ కార్యాలయం ప్రకటించింది. ఈ మూడు డిపోల మధ్య 23 ప్రత్యేక బస్సులను నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి కె. రమేష్ తెలిపారు. 
 
ప్రయాణికుల రద్దీని బట్టి దసరా తర్వాత కూడా అదనపు సర్వీసులను నడుపుతామని రమేష్ పేర్కొన్నారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని నుండి విజయవాడకు 114 అదనపు బస్సులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులన్నింటికీ ముందస్తు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. 
 
అలాగే, శబరిమల యాత్రికులు తమకు నచ్చిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి, తమకు కావలసిన సమయం వరకు ప్రయాణించేందుకు ఈ మూడు డిపోల బస్సులను అద్దెకు తీసుకోవచ్చని రమేష్ తెలిపారు. 
 
ప్రయాణికులు కాకినాడ డిపోను 7382910769 నంబర్‌లలో, ఏలేశ్వరం డిపోను 9391851155 నంబర్‌లలో, తుని డిపోను 9912200724  నంబర్లను సంప్రదించవచ్చు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి దొరికాడోచ్... స్థానికులే పోలీసులకు...?