ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 జూన్ 2024 (15:39 IST)

ఇదేంటి శ్యామలా? కారుకి సపోర్ట్ చేస్తే కారు పోయింది, ఫ్యానుకి సపోర్ట్ చేస్తే ఫ్యానూ పోయింది

Anchor Syamala
కర్టెసి-ట్విట్టర్
యాంకర్ శ్యామల. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైసిపి తీర్థం పుచ్చుకున్న దగ్గర్నుంచి జనసేన, తెదేపాలను ఉతికి ఆరేస్తూ వచ్చారు. అరవడం, ఆయాస పడటం తప్పించి పవన్ కల్యాణ్ సహాయపడినట్లు తను ఎక్కడా చూడలేదని ఎన్నికలు ఫలితాలు వచ్చే రెండు రోజులు ముందు అన్నారీమె.
 
ఇంకా ఏపీలో జనసేన చిరునామా వెతుక్కోవాల్సి వస్తుందనీ, తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పిన యాంకర్ శ్యామల, వైసిపి గెలుపు కోసం తను రాష్ట్రంలోని పలు ప్రధాన నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఆసక్తికరంగా యాంకర్ శ్యామల ఎక్కడైతే పర్యటించారో ఆ నియోజకవర్గాల్లోని అభ్యర్థులందరూ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. చూడండి యాంకర్ శ్యామల పర్యటించిన నియోజకవర్గాలు...