శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (12:34 IST)

పేర్ని నాని టార్గెట్ ... ఇంటిపై రాళ్లు కుర్చీలతో దాడి - కార్లు ధ్వంసం

perni nani
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన ఈ దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం చూపించారు. ఈ దాడిపై నెటిజన్లు మిశ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారన నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కర్మ అనుభవించక తప్పదంటున్నారు. 
 
ఈ రాళ్ల దాడి జరుగుతున్నపుడు పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిలువరించకుండా చూస్తూ మిన్నకుండిపోయారు. పైపెచ్చు దాడి భయంతో ఓ పోలీసు అధికారి అక్కడ నుంచి పారిపోయాడు. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పేర్ని నాని ఇంటిపై దాడి జరిగింది. 
 
టీడీపీ, జనసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. ఇపుడే ఇలాంటి ప్రతీకారాలేంటని మరికొందరు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్లనే జగన్ ఓటమి పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చేసిన కర్మ అనుభవించక తప్పదని కామెంట్స్ చేస్తున్నారు.