సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (15:06 IST)

ఒక వ్యక్తి మరీ ఇంత నిజాయితీగా ఉండకూడదు : అనుపమ్ ఖేర్

Anupam Kher
ఒక వ్యక్తి మరీ ఇంత నిజాయితీగా ఉండకూడదు అని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పరాజయం పాలుకావడం భారతీయ జనతా పార్టీకి దిగ్భ్రాంతికి కలిగించే అంశమన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీకి దిగ్భ్రాంతిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలపై అనుపమ్ ఖేర్ స్పందించారు.
 
'నిజాయతీపరుడైన వ్యక్తి మరీ నిజాయతీగా ఉండకూడదని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది. నిటారుగా ఉన్న చెట్టు పైనే సహజంగా గొడ్డలి వేటు పడుతుంటుంది. నిజాయతీపరుడు తన జీవితంలో ఎన్నో సమస్యల్ని భరించాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. నిజాయతీని వదులుకోడు. అందుకే ఆ వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు' అంటూ ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
 
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బీజేపీ సాధించిన ఫలితాలపై అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. బీజేపీకి కొన్నిచోట్ల అనుకోని ఓటములు ఎదురైనా.. మరికొన్నిచోట్ల అనూహ్య విజయాలు సొంతం అయ్యాయి. 'మూడోసారి కూడా ప్రజలు ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తాం' అని ఫలితాల అనంతరం మోడీ స్పందించారు.