1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Campaign for christianity in Buses

అన్యమత ప్రచారం బోర్డు జరిగిన సిటీ బస్సులు నిలిపివేత

Campaign
సింహగిరిపై భక్తులను తరలిస్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులపై అన్యమత ప్రచారాన్ని సంబంధించిన స్టిక్కర్లు ఉండడాన్ని దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సూపరింటెండెంట్ ముద్దాడ వెంకట రమణ గమనించి ఆ బస్సులను నిలిపివేశారు. బస్సు డ్రైవర్ కండక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
అన్యమత ప్రచారం బోర్డులు కలిగిన సిటీ బస్సులను సింహగిరిపై నడపడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియచేశారు. ఈ విషయాన్ని వెంకటరమణ ఆలయ ఈవో వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు దించి వేసి ఆ బస్సులను ఖాళీగా దిగువకు వెంకటరమణ పంపించివేశారు. 
 
సింహగిరిపై వచ్చేసింది బస్సులపై హిందూ మత ప్రచారం తప్ప అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అటువంటి బస్సు తీసుకురావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు వెంకటరమణ తెలియజేశారు. 
 
ఈ సంఘటనపై సింహాచలం డిపో మేనేజర్‌కి తీసుకెళ్లగా అన్యమత ప్రచారం చేస్తున్న బోర్డులు ఉన్న బస్సుల‌ను కొండమీదకు పంపకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
పెళ్ళయి ఆరు నెలలే... కోడి పులుసులో భర్తకు విషం పెట్టేసింది