1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandra babu naidu womens day offer

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. పసుకు-కుంకుమ కింద రూ.4వేలు..బాబు

Chandra babu
పసుప- కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఖాతాలో రూ.3,500లను డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. 
 
పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4,000 నగదును మరోసారి అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. పనిలో పనిగా వైకాపాపై ఫైర్ అయ్యారు. టీడీపీ అమలు చేసే సంక్షేమ పథకాలు చూసి వైకాపాతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. 
 
మరోవైపు.. డేటా చోరీపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి కంప్యూటరైజ్ చేసి, 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తల జాబితా కంప్యూటర్‌లో ఉంచామన్నారు. ఆ డేటాను దోచుకుని తిరిగి తమ ప్రభుత్వంపై కేసు పెడతారా? అంటూ ఫైరయ్యారు. కార్యకర్తల జాబితా ఎవరూ చేయలేదని, తాము చేశామని, ప్రతి ఒక్కరి డేటా తమ వద్ద ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని బలైయ్యాడు...