వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా వారం వారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌తో కలిసి మాట్లాడారు. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు పారదర్శకంగా...