సంబంధిత వార్తలు
- సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను ముక్కలై చెత్తలోకి చేరిపోతుంది : చంద్రబాబు
- ఏపీకి నెక్ట్స్ సీఎం బాబే.. వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు
- జగన్కు ఛాలెంజ్ : మండుతున్న ఎండలో రోజుకు 4 బహిరంగ సభలు చేస్తావా?
- తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
- ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు
పెన్షన్లు టీడీపీ ఆపినట్టు వైకాపా ప్రచారం చేస్తుంది... ఈసీ అభ్యంతరం చెప్పింది : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పిందని, తెలుగుదేశం పార్టీ కాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని చెప్పిందన్నారు. అందువల్ల ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ మీనాలకు చంద్రబాబు లేఖ రాశారు.
మరోవైపు, ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖ రాశార. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతంరాలు తెలిపిన నేపథ్యంలో ఏపీలో పెన్షన్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్లు పంపిణీ నిలిచిపోకూడదని అన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్లు పంపిణీని పూర్తి చేయాలని ఆయన కోరారు.
ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, లబ్దిదారులకు రేపు పెన్షన్ లు అందేలా చూడాలి.వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో... లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించే… pic.twitter.com/qa1sKVZtTs
— N Chandrababu Naidu (@ncbn) March 31, 2024
