తిరుపతి: స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు.. షాకైన కస్టమర్
Cockroach in Biryani
వివరాల్లోకి వెళితే.. తిరుపతి చెందిన ఓ వినియోగదారుడు బస్ స్టాండ్ సమీపంలోని స్పైసీ ప్యారడైస్ హోటల్ నుండి స్విగ్గి ఆన్లైన్ ద్వారా బకెట్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందుకు రూ.1255 చెల్లించాడు. బకెట్ బిర్యానీ ఆర్డర్ చేతికి వచ్చాక ఓపెన్ చేయగానే బిర్యానీలో బొద్దింకలు ఉండడంతో షాకయ్యాడు.
తిరుపతిలో ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందుకే తిరుపతిలో హోటల్స్, ఫుడ్ సేప్టీ అధికారులపై నగర వాసులు, యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే.. ఈ ఘటనపై స్విగ్గీ ఇంకా స్పందించలేదని తెలిసింది.
