మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (17:54 IST)

క్రాకర్స్‌తో ఛాలెంజ్.. ఆటో గిఫ్ట్.. సరదా కోసం వెళ్లి ప్రాణాలు బలి (video)

Konanakunte
Konanakunte
సోషల్ మీడియా పుణ్యమా అంటూ రీల్స్, ఫ్రాంక్స్, ఛాలెంజ్‌ల మైకంలో నేటి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం అంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 
 
బెంగళూరు, కోననకుంటే, వీవర్స్ కాలనీలో.. క్రాకర్స్‌తో చేసిన ఛాలెంజ్ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. టపాసులపై స్టీల్ బాక్సు పెట్టి దానిపై కూర్చోమని 32 ఏళ్ల శబరీష్ అనే వ్యక్తికి స్నేహితులు సవాల్ చేశారు. ఈ చాలెంజ్‌లో గెలిస్తే.. ఆటో గిఫ్టుగా ఇస్తామన్నారు. 
 
దీంతో ఎగిరిగంతేసిన ఆ వ్యక్తి.. మద్యం మత్తులో ఆ ఛాలెంజ్ స్వీకరించాడు. కానీ క్రాకర్స్ పేలడంతో తీవ్రగాయాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 2న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డ్ కావడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.