గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 నవంబరు 2024 (20:14 IST)

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

youths tortured the dog
జంతువులను హింసించడం నేరం అని తెలిసినా కొందరు అటువంటి పనులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కొంతమంది యువకులు కుక్కను హింసించారు. కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి దానికి నిప్పంటించారు. ముంబయి వీధుల్లో జరిగిన ఈ చర్య, వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయడంతో దుమారం రేపింది.
 
ఈ వీడియో ఫుటేజీలో యువకులు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి కాల్చడం, అది పేలడం, భయాందోళనకు గురైన కుక్క భయంతో పారిపోవడం కనిపించింది. ఈ పైశాచిక క్రియలో కుక్కకి గాయాలు అయినట్లు సమాచారం. బాధ కలిగించే ఫుటేజీ చూసిన వీక్షకులు బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.