Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్ 418 రిలీజ్ డేట్ ఫిక్స్
Prashanth Neel's 418 movie
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ 418తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 23న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హారర్, మిస్టరీతో సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో 418 గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది.
నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్
