1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Constable Sukanya committed suicide, what was the cause?

కానిస్టేబుల్ సుక‌న్య ఆత్మ‌హ‌త్య‌, కార‌ణం ఏమిటో?

Constable Sukanya
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ సుకన్య ఆత్మహత్యకు పాల్ప‌డింది. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేష‌న్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుకన్య మృతి సంఘ‌ట‌న ఇంకా మిస్ట‌రీగానే ఉంది. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు ఏంట‌నేది ఇంకా వెలుగులోకి రాలేదు.
 
కానిస్టేబుల్ సుక‌న్య‌కు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా. రెండు నెల‌ల క్రితం మ‌ళ్ళీ రెండో సారి పాప పుట్టడంతో ఆపరేషన్ చేయించుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయపురంలో ఉంటోంది సుకన్య.

ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు అత్తింటివారు చెపుతున్నారు. అయితే ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అగ‌త్యం ఎందుకు వ‌చ్చింది? ఆత్మ‌హ‌త్య‌కు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తర్వాతి కథనం
యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌‌పై భారీ తగ్గింపు.. రూ.37,999కే పొందవచ్చు