1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RPF Head Constable Suicide in Renigunta

రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

RPF Head Constable
చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆర్పీఎఫ్‌ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
కాగా, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ఐఏ విస్తృత సోదాలు..