శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (22:20 IST)

విశాఖపట్నంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించిన మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌

ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ బ్రాండ్‌ మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ (ఎంఅండ్‌ఎస్‌), విశాఖపట్నంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను వాల్తేర్‌ మెయిన్‌ రోడ్‌, శ్రీపురం వద్ద ప్రారంభించింది. ఈ నూతన, 10వేల చదరపు అడుగుల స్టోర్‌లో అత్యుత్తమమైన మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌ నాణ్యత కలిగిన వస్త్రాలు మరియు యాక్ససరీలను ఉమెన్స్‌వేర్‌, మెన్స్‌ వేర్‌, కిడ్స్‌ వేర్‌, లింగ్రీ మరియు బ్యూటీ విభాగాలలో బ్రాండ్‌ యొక్క తాజా కలెక్షన్‌ నుంచి ప్రదర్శించనున్నారు. భారతదేశంలో బ్రాండ్‌కు ఇది 96వ స్టోర్‌ కావడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్టోర్‌గా నిలుస్తుంది.
 
విశాఖపట్నంలో వాల్తేర్‌ మెయిన్‌ రోడ్‌ వద్ద ఏర్పాటుచేసిన ఈ నూతన స్టోర్‌, భారతదేశం పట్ల ఎంఅండ్‌ఎస్‌ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. కంపెనీకి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్‌గా ఇండియా నిలిచింది. ఎం అండ్‌ ఎస్‌ తమ మొట్టమొదటి స్టోర్‌ను 2001లో ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌, కొచి, కోయంబత్తూరు, మంగళూరు, చెన్నై,న్యూఢిల్లీ, ముంబై వంటి 34 నగరాలలో 96 స్టోర్లను నిర్వహిస్తుంది. వీటితో పాటుగా తమ సొంత వెబ్‌సైట్‌ ద్వారా ఓమ్నీ ఛానెల్‌ ఉనికిని సైతం నిర్వహిస్తూనే, అమెజాన్‌, మింత్రా, అజియో వంటి సుప్రసిద్థ మార్కెట్‌ ప్రాంగణాల వద్ద కూడా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
 
ఎం అండ్‌ ఎస్‌ యొక్క క్లాతింగ్‌ ఆఫర్‌, అసాధారణ నాణ్యతతో ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో కూడిన శైలితో అత్యాధునిక అంతర్జాతీయ ధోరణులు మరియు ఫ్యాషన్‌ను మిళితం చేస్తుంది. మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ కలెక్షన్స్‌‌ను నైపుణ్యవంతులైన అంతర్జాతీయ డిజైనర్లుతో కూడిన బ్రాండ్‌ అంతర్గత బృందం లండన్‌లో రూపకల్పన చేసి, అభివృద్ధి చేసింది.  అత్యుత్తమ, అత్యాధునిక కలెక్షన్‌ను అందించడం ద్వారా ఈ నూతన స్టోర్‌ తమ తలుపులను విశాఖపట్నంలో తెరిచింది.
 
నూతన స్టోర్‌ను సందర్శించిన వినియోగదారులు ఎం అండ్‌ ఎస్‌ యొక్క తాజా సీజన్‌ కలెక్షన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఫ్యాషనబుల్‌ వార్డ్‌రోబ్‌ ఎసెన్షియల్స్‌, క్యాజువల్‌ వస్త్రాలు, నాణ్యమైన ఫుట్‌వేర్‌ మరియు యాక్ససరీలు ఉంటాయి. ఉమెన్స్‌వేర్‌ మరియు మెన్స్‌వేర్‌ 799 రూపాయల ప్రారంభ ధరతో, కిడ్స్‌వేర్‌ 599 రూపాయలు, లింగ్రీ 799 రూపాయలు మరియు బ్యూటీ 399 రూపాయల  ప్రారంభ ధరతో  లభిస్తాయి.
 
ఈ స్టోర్‌లో విస్తృత శ్రేణి ట్రెండ్‌ ఆధారిత అంశాలు టీషర్ట్‌లు, డెనిమ్‌, క్యాజువల్‌ బేసిక్స్‌, సేపరేట్స్‌ మరియు లినెన్‌ను కీలకమైన సిల్‌హ్యూటీస్‌ను విలాసవంతమైన కలర్‌ ప్యాలెట్‌ మరియు డిటెయిల్డ్‌ ఫినీషింగ్‌తో అందిస్తుంది. లింగ్రీ మరియు స్లీప్‌వేర్‌ కలెక్షన్స్‌, ప్రకాశవంతమైన కలర్‌ ప్యాలెట్స్‌ను అందించడంతో పాటుగా సున్నితమైన ప్రింట్స్‌ను విభిన్నమైన శైలిలతో పాటుగా స్కిన్‌కేర్‌, ఫ్రాగ్నాన్స్‌, బాత్‌ మరియు బాడీ ఉత్పత్తులతో అందం అందించడానికి అంకితమైంది.
 
మార్స్‌ అండ్‌ స్పెన్సర్‌  ఎండీ జేమ్స్‌ మున్సన్‌ మాట్లాడుతూ ‘‘అత్యుత్తమ నాణ్యత ఉత్పత్తులను చక్కటి విలువతో అందించడం కోసం ఎం అండ్‌ ఎస్‌ ప్రతీకగా నిలుస్తుంది. విశాఖపట్నంలో మా మొట్టమొదటి స్టోర్‌ను తెరువడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ నగరంలో అపారమైన అవకాశాలు మాకున్నాయి. అంతర్జాతీయంగా మా వినియోగదారులకు మేము అందించేటటువంటి అంతర్జాతీయ ఫ్యాషన్‌, నాణ్యత పట్ల ఇక్కడి వినియోగదారులు తమ అభిరుచిని వ్యక్తం చేస్తుండటం మేము ఇక్కడి వినియోగదారులలో చూశాం. మా కలెక్షన్స్‌ను, మా భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దాము. ఇవి దేశవ్యాప్తంగా అమితాదరణ పొందాయి. మా నూతన స్టోర్‌కు విశాఖపట్నం వాసులను స్వాగతించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. స్థానిక మార్గదర్శకాలకనుగుణంగా అన్ని భద్రతా మార్గదర్శకాలను మేము అనుసరిస్తున్నాము’’ అని అన్నారు.