శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 28 జులై 2021 (15:29 IST)

విశాఖ ఉక్కు నూరు శాతం అమ్మేస్తాం: కేంద్రం అఫిడవిట్

విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మరాదని సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కీలకాంశాలు పొందుపరిచింది కేంద్రం.
 
విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని వివరించింది. ఉద్యోగులు ప్లాంటు అమ్మకం చేయవద్దనటం సరికాదని, 100 శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతాం, ఇప్పటికే బిడ్డింగ్ లు ఆహ్వానించాం అని హైకోర్టుకు కేంద్రం నివేదించింది.
 
పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయన రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారని పేర్కొంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.