శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (20:12 IST)

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేయాలా? చేస్తే వచ్చేదేంటి?: విజయసాయి

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంపీలు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షం తెదేపా ఇచ్చిన పిలుపుపై ఎంపీ విజయసాయి రెడ్డి కొట్టి పారేశారు. ఎంపీలంతా రాజీనామా చేస్తే ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోతుందా? అలా రాజీనామాలు చేస్తే కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకదన్నారు. పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే మన గళం వినిపించగలమనీ, అలా కాకుండా రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ వుండదన్నారు.
 
ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని చెప్పిన ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు.
 
కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నదంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్నదంతా నాటకమేనంటూ మండిపడ్డారు.