మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:53 IST)

విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డ్.. 38శాతం ఉత్పత్తి పెంపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు సాధించింది. జులై నెలలో అత్యధికంగా 540.8 వేల టన్నుల ఉక్కును విక్రయించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 38శాతం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌ - జులై మధ్య 1,538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్టు ఆర్‌ఐఎన్‌లో ట్విట్టర్‌లో తెలిపింది.
 
గతేడాదితో పోలిస్తే 48 శాతం వృద్ధి సాధించినట్టు పేర్కొంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న క్రమంలో విశాఖ ఉక్కు రికార్డు నెలకొల్పడం చర్చనీయాంశమైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు రెండ్రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.