సంబంధిత వార్తలు
- వెనక్కి తగ్గని మంత్రి కొడాలి నాని .. ఎస్ఈసీ నిమ్మగడ్డను దొంగతో పోల్చారు!
- జగన్ని చూసి ట్రంప్ నేర్చుకున్నాడు.. కనకరాజ్ వస్తే అన్నీ ఏకగ్రీవాలే : జేసీ దివాకర్
- ఢిల్లీ సర్కారు కొరఢా... ముఖానికి మాస్క్ ధరించకుంటే రూ.2 వేలు ఫైన్
- ఆంధ్రప్రదేశ్: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?
- ఈ దఫా కోర్టు అక్షింతలతో పాటు చర్యలు తప్పవేమో... : ఐవైఆర్
ఏపీలో కొత్తగా 1221 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932కు చేరింది. 8,37,630 మంది చికిత్సకు కోలుకొని డిశార్జి అయ్యారు. 15,382 మంది దవాఖానాల్లో చికిత్స పొందున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు 6,920 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 66,002 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 94,74,870 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
జిల్లాల వారీగా యాక్టివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 465, చిత్తూరు 828, ఈస్ట్ గోదావరిలో 4881, గుంటూరులో 1724, కడపలో 296, కృష్ణలో 2107, కర్నూలులో 215, నెల్లూరులో 1023, ప్రకాశంలో 581, శ్రీకాకుళంలో 443, విశాఖపట్టణంలో 1282, విజయనగరంలో 218, వెస్ట్ గోదావరిలో 1319లతో కలుపుకుని మొత్తం 15382 కేసులు ఉన్నాయి.
