1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Degree student commits suicide in Srikakulam district

ముఖంపై మచ్చలు.. అందంగా లేనని డిగ్రీ విద్యార్థి సూసైడ్?

Degree
ముఖంపై నల్లటి మచ్చలు ఉండటంతో అందంగా లేనని భావించిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిగ్రీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ (20) ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. ఈ మచ్చలు పోయేందుకు ఎన్నో రకాలైన క్రీములు వాడాడు. వైద్యులను సంప్రదించాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో కుంగిపోయాడు.
 
కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్‌ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు.. సోంపేట ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. నేడు కరోనా పరీక్ష చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. 
తర్వాతి కథనం
కాస్టీ బైక్‌పై చీఫ్ జస్టీస్ బాబ్డే - హార్లే డేవిడ్‌స‌న్ బైకుతో ట్రయల్ రన్