పదిలక్షల మంది ఫాలోయర్స్ వున్న పదహారేళ్ల టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య
ఫోటోకర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
2020 సంవత్సరం బాలీవుడ్ సినీ పరిశ్రమలో కుదుపులకు గురవుతోంది. పరిశ్రమ ప్రసిద్ధ తారలను కోల్పోయింది. ఇర్ఫాన్ ఖాన్ నుండి ప్రారంభమై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దాకా సాగింది. తాజాగా మరో స్టార్ ఆత్మహత్య చేసుకున్నది.
16 ఏళ్ల ప్రసిద్ధ టిక్ టాక్ సియా కక్కర్ గురువారం ఆత్మహత్య చేసుకున్నది. సియా ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నదో తెలియరాలేదు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు ఒక రాత్రి ముందు, సియా తన మేనేజర్ అర్జున్ సరీన్‌తో ఒక పాటకు సంబంధించి మాట్లాడింది. అర్జున్ మాట్లాడుతూ, సియా తనతో మాట్లాడినప్పుడు బాగానే ఉన్నది. ఆమె అస్సలు కలత చెందినట్లు అనిపించలేదు. సియా ఎందుకు ఈ చర్య తీసుకుందో తనకు కూడా అర్థం కాలేదని తెలిపింది.
సియా చాలా సంతోషంగా ఉన్న అమ్మాయి. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేది. సియా టిక్ టాక్ స్టార్, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీగా అనుచరులున్నారు. సియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 91 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. టిటాక్‌కు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.