1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Do you know what coronavirus symptoms are? Official Public Service Announcement on Coronavirus from the AP Government

కరోనావైరస్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా? 10 రోజులపాటు ఇలా

corona
కరోనా లక్షణాలపై ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. ఎన్ని రకాల ప్రచారం చేస్తున్నా ఈ లక్షణాలను పసిగట్టడంలో చాలా మంది విఫలమవుతున్నారు. అందుకే ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రోజువారీగా ఎదురయ్యే లక్షణాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండీ...
 
లక్షణాలు:
ముందుగా - వికారంగా అనిపిస్తుంది. ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.
 
మొదటిరోజు  - ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి... ఇతర సమస్యల్ని పెంచుతుంది. ( జ్వరం వస్తే  అలర్ట్ అవ్వాల్సిందే)
 
2వ రోజు - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ..ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.
 
3వ రోజు - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.
 
‌4వ రోజు - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.
 
5వ రోజు - ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. (ముసలి వారు, ఆల్రెడీ శ్వాస సమస్యలు ఉన్నవారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది) 
(పై లక్షణాలు కంటిన్యూ అవుతాయి)
 
6వ రోజు - డే 5 లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.
 
7వ రోజు - మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే... పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.
 
8వ రోజు - ఈ సమయంలో... ఏఆర్డీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. అంటే... ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.
 
9వ రోజు - ఏఆర్డీఎస్ సమస్య మరింత పెరుగుతుంది.
 
10వ రోజు - పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.
 
17వ రోజు - మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
About Writer
ఎం
తర్వాతి కథనం
అచ్చెన్నను కలవాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోండి.. చంద్రబాబుకు జీజీహెచ్ సూచన