బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (16:31 IST)

అచ్చెన్నకు అవసరమైతే మరోమారు ఆపరేషన్

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.

ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన చెప్పారు.

గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్ గానే ఉందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.