1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Fans pressure on pawan kalyan for AP Special Status

ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సిందే.. పవన్‌పై ఒత్తిడి

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే తిరిగి న్యాయం జరుగుతుందనీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సి) తయారు చేసిన నివేదికలో

Pawan Kalyan
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే తిరిగి న్యాయం జరుగుతుందనీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సి) తయారు చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు కేంద్రంపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ పవన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి చెందిన ఎంపీలు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో, ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి, జనంలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని పవన్ అభిమానులు నినదిస్తున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున జనసేన అభిమానులు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు. ఆదివారం నుంచి జనసేన కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి కనిపిస్తోంది. మరోవైపు హోదాపై పోరాటం వెంటనే ప్రారంభించాలని జనసేన ఆఫీసుకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
యూపీలో కేసీఆర్ ప్రకంపనలు.. చేతులు కలుపుతున్న బద్ధశత్రువులు