సంబంధిత వార్తలు
- గొడవ ఆపమంటే ఆపలేదని తుపాకీతో కాల్చాడు...
- పెళ్లి రోజే చివరి రోజైంది... ఎస్.ఐ దుర్మరణం
- ఏంట్రా నువ్వు నాకు చెప్పేది... కొట్టికొట్టి చంపేసిన ప్రియురాలు...
- ఫోనులో వేద మంత్రాలే సాక్షిగా రహస్య పెళ్లి... విద్యార్థినిని గర్భవతి చేసిన ఆర్ఎంపీ వైద్యుడు
- వీడిన శ్రీజ్యోతి మిస్టరీ : 20 యేళ్లు చిన్నదైనా ఆశపడ్డాడు.. కాదన్నందుకు కడతేర్చాడు...
మద్యం మత్తులో పిల్లల గొంతు కోసిన తండ్రి... ఆపై తానుకూడా...
గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. మద్యం మత్తులో తన ఇద్దరు పిల్లల గొంతులను కోశాడు. ఆపై తాను కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆస్తి విషయంలో కొంత కాలంగా అత్తవారింటితో విరోధం ఏర్పడింది. తరచూ తగువు పడుతుండేవారు. మద్యానికి బానిసై భార్యను కూడా వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. భార్య కోపంతో పుట్టింటికి వెళ్లి పోయింది. నిన్న రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చిన రమణమూర్తి తన పిల్లలు భవాని నాగదినేశ్(8), సాయి(6)ని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆపై తాను కూడా ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తర్వాతి కథనం
