బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (18:52 IST)

గొడవ ఆపమంటే ఆపలేదని తుపాకీతో కాల్చాడు...

ఆవేశంలో మనుషులు ఏమి చేస్తారో వారికే తెలియదు. యువకులు పార్టీ చేసుకుంటూ గొడవ చేస్తున్నారని వారిలో ఒకరిని కాల్చేశాడు ఓ వ్యక్తి. గొడవ ఆపమని చెప్పినా వినకపోవడంతో వాగ్వివాదానికి దిగి ఈ పని చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ పైనున్న ఖాళీ స్థలంలో మోహిత్‌ చంద్ర(24) అనే వ్యక్తి తన ముగ్గురి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అదే భవంతిలోని 3వ అంతస్తులో నీరజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పార్టీలో రాత్రి వారు గొడవ చేయడం చూసి 12 గంటల సమయంలో భార్య అక్కడకు వెళ్లి వారిని మందలించింది. భార్యతోపాటు నీరజ్ కూడా అక్కడికి వచ్చాడు. 
 
మోహిత్, నీరజ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే నీరజ్ తన ఫ్లాట్‌లోకి వెళ్లి తుపాకీ తెచ్చి మోహిత్‌ని కాల్చాడు. తల పైన తీవ్ర గాయాలవటంతో కుటుంబ సభ్యులు అతడిని ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నీరజ్ తరచుగా గాలిలో కాల్పులు జరిపేవాడని కూడా దృష్టికి వచ్చింది.