సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (17:28 IST)

పిట్ట కోసం చెట్టెక్కాడు... పిట్టలా చెట్టుకు వేలాడాడు... ఏం జరిగింది?

రామచిలుక కోసం చెట్టు ఎక్కాడు. చివరకు అదే చెట్టుకు వేలాడాడు. జార్ఖండ్‌లోని గాద్వాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బబ్లూ అనే ఓ వ్యక్తి రామ‌చిలుక‌ను పట్టుకోవడం కోసం సుమారు 40 అడుగుల ఎత్తున్న చెట్టు ఎక్కాడు. చివరకు ఎక్కిన చెట్టుకే అతను వేలాడాల్సి వచ్చింది. చెట్టు తొర్రలో ఉన్న చిలుక కోసం ఆ వ్యక్తి తొర్రలో చెయ్యి పెట్టాడు. ఆ చేతిని బయటకు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 
 
రంధ్రంలో చెయ్యి పెట్టగానే అతని చేయి అందులో చిక్కుకుపోయింది. దీంతో చెయ్యి విరిగింది. అదే క్రమంలో బ్యాలెన్స్ తప్పడంతో అతను చెట్టుకు వేలాడాడు. బిగ్గరగా అరవడంతో స్థానికులు అతడిని గుర్తించారు. వెంటనే మీరల్ పోలీస్‌స్టేషన్ నుండి ఫైర్ బ్రిగేడ్ టీమ్‌ని పిలిపించి, అతడిని కిందికి దించారు. కాగా చెట్టుకు వేలాడుతున్న అతడిని చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడ జనం గుమిగూడడం గమనార్హం.