1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Ganta Srinivasa Rao comments on Three Capitals

విశాఖ వాసిగా రాజధానిని ఎలా వద్దంటాను : గంటా శ్రీనివాస రావు

Ganta Srinivasa Rao
విశాఖవాసిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే తాను ఎందుకు వద్దంటానని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతించకుండా ఉండలేనని స్పష్టం చేశారు. 
 
నిజం చెప్పాలంటే విశాఖపట్టణ నగరం ఆర్థికంగా ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందన్నారు. కానీ, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మరిన్ని వనరులు లభిస్తాయన్నారు. అందువల్ల విశాఖ నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తామంటే ఎలా వద్దంటానని చెప్పారు. 
 
ఇకపోతే, అమరావతి నుంచి రాజధానిని తరలించిన తర్వాత అక్కడి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని గంటా స్పష్టం చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ తీర్మాన ప్రతిని పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్టు గంటా వెల్లడించారు. 
తర్వాతి కథనం
ఏబీవీపి వాళ్లే దాడి చేశారు.. జెఎన్‌యు ఘటనపై నటి తాప్సి ఆరోపణ