సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (10:49 IST)

మూడు ముక్కలాట సరైనదే : రఘురామకృష్ణంరాజు

నవ్యాంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని వైకాపాకు చెందిన నరసాపురం రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం వెస్ట్ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం మంచిదేనని చెప్పారు. జనవరి 20వ తేదీన అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రాజధానులపై ఓ ప్రకటన వెలువడుతందని ఆయన చెప్పారు. 
 
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు అంశాలన్నారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న 'అధికార వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అన్న వాదన నూటికి నూరుపాళ్లు సమంజసమైనదన్నారు. అయితే సీఎం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నారని వివరించారు. 
 
గ్రోత్‌ ఇంజన్‌లా ఈ విభజన ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే అమరావతి రైతుల, ప్రజల ఆశలు వమ్ము చేయకుండా బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఆ శక్తి సామర్ధ్యాలు ఆయనకు ఉన్నాయని ఎంపీ అన్నారు.