సంబంధిత వార్తలు
- ప్రభుత్వ పింఛన్ కోసం పుట్టుకొచ్చిన అంగవైకల్యం : వైకాపా సర్పంచ్ దంపతుల బాగోతం!!
- ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?
- యువతిని కలిసిన వ్యక్తిని బెదిరించి రూ.60 వేలు దోచుకున్న దుండుగులు..
- చరిత్రను గుర్తు చేసుకోవయ్యా రేవంతన్న.. కేటీఆర్ ధ్వజం
- భర్త కావాలి.. ప్రియుడు కావాలి.. కరెంట్ పోల్ ఎక్కిన మహిళ.. కారణం?
లోన్ యాప్ రుణం తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న ఆటో డ్రైవర్... రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేసిన వైద్యులు!! (Video)
ఒక లోన్ యాప్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఓ ఆటో డ్రైవర్ కిడ్నీని మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆపరేషన్ చేసి కిడ్నీని తీసిన ఆస్పత్రి వైద్యులు మాత్రం రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేశారు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలోగా చెల్లించేశాడు. అయితే, రుణం ఇంకా తీరలేదని, మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ కనిపించింది.
అందులోని ఫోన్ నెంబర్‌ను సంప్రదించగా.. విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కిడ్నీ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తిప్పించుకుని 7 నెలల తర్వాత రూ.లక్ష చేతిలో పెట్టారని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశాడు. మరోవైపు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ ఆటో డ్రైవర్ బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లోన్ యాప్ అప్పులు తీర్చడానికి రూ. 30 లక్షలకు కిడ్నీ అమ్ముకున్న యువకుడు.
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
కిడ్నీ తీసుకొని చేతిలో లక్ష పెట్టి యువకుడిని మోసం చేసిన విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం.
గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్ల ద్వారా అప్పులు చేసి అవి తీర్చడానికి 30 లక్ష… pic.twitter.com/6h6Qv3zFHh
