గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (18:01 IST)

భర్త కావాలి.. ప్రియుడు కావాలి.. కరెంట్ పోల్ ఎక్కిన మహిళ.. కారణం?

Woman
Woman
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ వినూత్న నిరసన చేసింది. భర్తను కాదన లేనని.. ప్రియుడిని దూరం చేసుకోలేనని.. భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి వుంటానని పట్టుబట్టింది. ఇందుకోసం కరెంట్ పోల్ ఎక్కి మహిళ ఆందోళనకు దిగింది.
 
భర్త, పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. చివరికి ఈ వ్యవహారం బయటపడటంతో ఇద్దరితో కలిసి వుంటానని పట్టుబట్టింది. ఇందుకు ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో కరెంట్ పోల్ ఎక్కింది. యూపీలోని గోరఖ్‌పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే..ప్రిపాయిచ్ ప్రాంతంకు చెందిన 34 ఏళ్ల మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడేళ్లుగా ఆమె పొరుగూరి వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియరావజంతో వారిద్దిరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే అసలు సీన్ వెలుగులోకి వచ్చింది. భర్తతో గొడవపడిన సదరు మహిళ భర్తను వదులుకోనని.. ప్రియుడిని దూరం చేసుకోనని చెప్పింది. ఈ విషయం విని భర్తతో పాటు కుటుంబీకులంతా షాకయ్యారు. ప్రియుడితో కలిసి వుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భర్తను ఒప్పించే ప్రయత్నం చేసింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని కరెంట్ పోల్ ఎక్కింది. 
 
దీన్ని గమనించి స్థానికులు వెంటనే ఈబీకి ఫోన్ చేసి చెప్పడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఆమెను బలవంతంగా కిందికి దించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.