సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:01 IST)

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రియుడితో వెళ్లిపోయిందనీ...

suicide
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో నిద్రమాత్రలు మింగి తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాలేజీకి వెళ్లే తమ కుమార్తె ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఉన్నికృష్ణ, బిందు దంపతులు తీవ్రమైన మానసికక్షోభకు గురయ్యారు. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి మోతాదుకు మించి నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిందు శనివారం రాత్రి మృతి చెందగా, ఉన్నికృష్ణ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం పట్ల ఆ దంపతులు మానసికంగా కుంగిపోయారనీ, ఎంత నచ్చజెప్పినా వినకుండా కుమార్తె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని బంధువులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.